ఓదెల 2-తిరుపతిగా వశిష్ట

5
- Advertisement -

తమన్నా భాటియా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్‌ కొలాబరేషన్ లో హైలీ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ‘ఓదెల 2’ లో మునుపెన్నడూ చూడని నాగ సాధువు పాత్రలో మెస్మరైజ్ చేయడానికి రెడీగా వున్నారు. 2021 బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఒదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్నారు. ప్రతి పోస్టర్ తమన్నా పాత్ర యొక్క డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోంది.

దీపావళి శుభ సందర్భంగా, మూవీ మెయిన్ విలన్ వశిష్ట ఎన్ సింహ క్యారెక్టర్ ని తిరుపతిగా పరిచయం చేసారు. ఈ డివైన్ యాక్షన్ థ్రిల్లర్‌లో వశిష్ట ఒక భయంకరమైన రాక్షస పాత్రలో కనిపించబోతున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ వశిష్ట టెర్రిఫిక్ ఇమేజ్‌ని ప్రజెంట్ చేస్తోంది, అతని ముఖం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. అతను ఓదెల యొక్క పీడకల. ఈ భీకరమైన లుక్ ప్రేక్షకులను ఎడ్జ్‌లో ఉంచే స్పిన్- టిగ్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోందని ప్రామిస్ చేస్తోంది.

సంపత్ నంది సూపర్ విజన్ లో ఓదెల 2 ఎమోషనల్ డెప్త్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్‌తో నిండిన గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.  చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.

Also Read:బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్

- Advertisement -