కాశీలో ‘ఓదెల 2’

24
- Advertisement -

2022లో ఓటీటీలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సంచలన విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. టీమ్ దాని సీక్వెల్ ‘ఓదెల2’ టైటిల్ తో వస్తోంది. ఇది కథ, స్పాన్, కాస్టింగ్, ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాల పరంగా మ్యాసివ్ గా ఉండబోతోంది.

యూనివర్సల్ అప్పీల్ వున్న ఓదెల 2లో తమన్నా భాటియా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. తమన్నా తన ఇటీవలి OTT లో వరుస సూపర్ హిట్స్ తో దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. ఈ చిత్రాన్ని పలు భాషల్లో థియేటర్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది క్రియేటర్ గా వున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. ఓదెల 2 దాని మరింత రూటెడ్ గా థ్రిల్లింగ్ గా వుండబోతుంది. సీక్వెల్ గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలు చాలా అద్భుతంగా వుండబోతున్నాయి. టైటిల్ పోస్టర్ చాలా క్రియేటివ్ గా ఉంది. ఇది మల్లన్న స్వామిగా పూజించబడే శివుని త్రిశూలాన్ని చూపిస్తుంది. నెంబర్ 2 త్రిశూలం విభూతి, ఒక బిందీ శివలింగాన్ని చూడగలిగే విధంగా రూపొందించారు. ఇది ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది.

హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ముఖ్య తారాగణం. VFX సినిమాలో టాప్ క్లాస్ ఉండబోతుతున్నాయి, ఓదెల 2లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పని చేస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Also Read:Bhumana:క్రీడాస్ఫూర్తితో ప‌నిచేయాలి

- Advertisement -