ఆర్ఆర్ఆర్…ప్రమోషన్స్‌కే అన్ని కోట్లా..?

89
rrr
- Advertisement -

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. 2022 సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.

ఇండియావైడ్‌గా సినిమా రిలీజ్ కానుండగా పెద్ద నగరాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ సెట్లు వేయగా దాదాపు రూ. 20 కోట్లు కేవలం ప్రమోషన్ కార్యక్రమాలకే ఖర్చు చేయనున్నారట. ఆర్ఆర్ఆర్‌ని రూ.550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా వెయ్యి కోట్లు రాబట్టేలా జక్కన్న వ్యూహాలు రచిస్తున్నారట.

ఇక ఈ అక్టోబర్ 29న ప్రపంచంలోని ఏ చిత్రానికి ఇంతకు ముందెన్నడూ చూడని, వినని కొలాబరేషన్ ను చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది “ఆర్ఆర్ఆర్” టీం. అయితే అక్టోబర్ 29న రానున్న అప్డేట్ ఏమిటన్న విషయంపై టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -