చాలామంది పిల్లలు వయసుకు మించి బరువు పెరుగుతుంటారు. తద్వారా తద్వారా పదేళ్ళ వయసులోనే ఇరవై ఏళ్ల వయసు వారి వలె కనిపిస్తుంటారు. ఇలా పిల్లలు చిన్నవయసులోనే బరువు పెరగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. సాధారణంగా చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోరు. తల్లిదండ్రులు కూడా వారికి అధికంగా ఫుడ్ పెట్టడం వంటివి చేస్తుంటారు. తద్వారా చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరగడానికి కారణమౌతాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, తీపి పదార్థాలు, ఇతరత్రా తిండిబండరాలు పిల్లలు తరచూ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
వీటి కారణంగా శరీరంలో వ్యర్థమైన కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఊబకాయానికి దారి తీస్తుంది. చిన్నపిల్లలు వయసుకు మించి బరువు పెరగడం వల్ల చిన్న వయసులోనే ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా ఉత్సాహం కొరవడుతుంది. ఆలోచనలు మందగిస్తాయి. ఆటలపై ఆసక్తి చూపరు. కొద్ది దూరం పరిగెత్తడానికి ఆయాస పడుతుంటారు. వీటి కారణంగా పూర్తిగా బద్దకంగా మారిపోతుంటారు.
ఇలాంటి సమస్యలు వయసు పెరిగేకొద్దీ పిల్లలకు దీర్ఘకాలిక వ్యాధులుగా మారిపోతాయి. కాబట్టి చిన్న పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కు పిల్లలను దూరంగా ఉండాలి. పిల్లలకు ఆకుకూరలు, కూరగాయలు తినే అలవాటు నేర్పించాలి. వారికి పోషనార్థం పాలు గుడ్డు వంటివి ఆహార డైట్ లో చేర్చాలి. ఇంకా పిల్లలకు ఎక్కువగా ఆటలపై దృష్టి ఉండేలా వారిని ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల చిన్న వయసులో బరువు పెరగకుండా వయసు తగ్గ రీతిలో ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.