అధిక బరువు ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అధిక బరువుతో బాధపడుతున్న వారే. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఏదైనా ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది.
శరీరంలో వ్యర్థమైన కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఊబకాయానికి దారి తీస్తుంది. చిన్నపిల్లలు వయసుకు మించి బరువు పెరగడం వల్ల చిన్న వయసులోనే ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. ఊబకాయంతో మధుమేహం, హై బీపీ, గుండెజబ్బులు మాత్రమే కాదు కిడ్నీల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది.
ఇందుకు సంబంధించి ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెల్లడైంది. మధుమేహం ఉన్న వారికి కిడ్నీ సమస్యలు రావడం అత్యంత సహజం. అంతేకాదు ఊబకాయం ఉన్నవారికి మూత్రపిండాల సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని తాజా రీసెర్చ్‌లో వెల్లడైంది. చుంచు ఎలుకలు, పుట్టుకతోనే ఊబకాయంతో ఉన్న విస్టార్ ఎలుకలపై కొన్ని ప్రయోగాలు జరిపారు. ఈ క్రమంలోనే వాటికి జంక్‌ఫుడ్‌ను, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినిపించడం చేశారు. ఫలితంగా కొన్ని నెలల తర్వాత ఎలుకలకు ఊబకాయం వచ్చింది. అదేవిధంగా వచ్చిన ఫలితాలను మనుషులకు సంబంధించిన డేటాతో సరిపోల్చారు పరిశోధకులు. ఏదిఏమైనా అందరూ సరైన పోషకాహారం తీసుకోవడం, తగిన శారీరక శ్రమ, నిద్ర ఉండేలా చూసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేసేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
Also Read:రోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు!