త్వరలో అధ్యక్ష పదవి నుంచి పదవీ విరమణ తీసుకుంటున్న అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ‘జిమ్మీ కిమ్మెల్ లైవ్’ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అమెరికా అధ్యక్ష పదవికి రెండు సార్లు మాత్రమే అర్హులు. మరి అవకాశం ఉంటే మూడోసారి పోటీ చేసేవారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒబామా తన సతీమణి మిషెల్ కు రాజకీయాలంటే ఆసక్తి లేదని, ఒకవేళ తాను మళ్ళీ పోటీ చేస్తే మిషెల్ విడాకులు ఇచ్చేస్తుందని అన్నారు.
తమ దేశ చరిత్రలోనే ఒబామా చెత్త అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోతారంటూ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఒబామా.. షోలో స్పందిస్తూ ట్రంప్ తనను కనీసం అధ్యక్షుడిగానైనా దిగిపోతానని అన్నాడని చమత్కరించారు. తాను కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమోషన్స్ కోసం కొన్ని రోజుల క్రితం శ్వేతసౌధంలో కమెడియన్ బిల్ ముర్రేతో గేమ్ ఆడానని చెప్పారు. అందులో గోల్ఫ్ బాల్స్‌ను గ్లాస్‌లో పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ గేమ్‌లో బిల్ ముర్రే కొన్ని సార్లు గెలిచారని చెప్పారు. అయితే, గ్లాస్ రిగ్గింగ్ చేసిందని ఒబామా చమక్కులు విసిరారు.
చాలా సార్లు తాను ట్రంప్‌ను టీవీలో చూస్తూ నవ్వుకున్నట్లు ఒబామా చెప్పారు. తాను పలు సార్లు నిద్రపోతున్న సమయంలోనూ అత్యవసర ఫోన్ కాల్స్ తీసుకున్నానని ఒబామా చెప్పారు. అయితే, డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేస్తే పగటిపూట కూడా స్పందన ఉండదని ఆరోపించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వేలను బట్టి చూస్తే ప్రస్తుతం ఆమే ఆధిక్యంలో ఉన్నారు. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. షికాగోలో ఒబామా ఇప్పటికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.