జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:కేసీఆర్

259
telangana kcr
- Advertisement -

తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు పార్టీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ …వీలైనంత త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. గెజిట్ పబ్లికేషన్‌ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేవిధంగా తెలంగాణ జర్నలిస్టులు ఉండబోతున్నారని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించామని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో త్వరలో క్రీయాశీలంగా వ్యవహరిస్తానని చెప్పిన సీఎం రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం సహించరాదన్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు స్కీంను అమలుచేస్తామని చెప్పారు.

వందకు వందశాతం మేనిఫెస్టోని అమలు చేసి నిరూపించామని దీనిపై ఎవరు చర్చకు పిలిచినా సిద్ధమే అన్నారు. ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తున్నామని తెలిపారు. రైతుబంధు,బీడీ కార్మికుల పెన్షన్‌ మేనిఫెస్టోలో చెప్పకున్నా అమలుచేస్తున్నామని చెప్పారు. పది సంవత్సరాల తర్వాత మైనార్టీ విద్యార్థుల్లో విప్లవం రాబోతుందన్నారు.

తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా ప్రజలు టీఆర్ఎస్‌కు మరోసారి అధికారం ఇచ్చామన్నారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దనకే పాలన అందించామన్నారు. కంటివెలుగు కార్యక్రమం ఎర్రవెల్లి నుండే వచ్చిందన్నారు. ఆ ఆలోచనతోనే రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగుకు శ్రీకారం చుట్టామన్నారు. అమ్మ ఒడి,కేసీఆర్ కిట్‌తో గర్బిణి స్త్రీలకు అండగా నిలిచామన్నారు. కళ్యాణలక్ష్మీతో బాల్యవివాహాలకు చెక్ పడిందన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మంత్రివర్గంలో 18 మందికంటే ఎక్కువమందికి ఛాన్స్ లేదన్నారు.

కాంగ్రెస్,బీజేపీ పరిపాలనలో విఫలమయ్యాయని చెప్పారు. ప్రైమరీ స్కూళ్లు,వైద్యంపై కేంద్రం పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ జాతీయపార్టీ అధ్యక్షుడి హోదాలో తప్పులు చెప్పడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు ఉంటే ఒకవిధంగా లేకుంటే మరోవిధంగా మాట్లాడుతుందన్నారు. తెలంగాణ బీజేపీ సీపీఎస్‌ని వ్యతిరేకిస్తామంటే కేంద్రంలో మాత్రం దీనిపై మరో విధానం ఉందన్నారు. దేశ రైతాంగం తరపున మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

తానే చొరవ తీసుకొని జర్నలిస్టుల ఇళ్ల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. తనతో పాటు ఒకరు లేదా ఇద్దరు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. వారం రోజుల్లో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరుతుందన్నారు. కాంగ్రెస్,బీజేపీ దొందు దొందేనని చెప్పిన కేసీఆర్ ఈ దేశానికి కొత్త ఆర్థిక,వ్యవసాయ విధానం రావాలని ఆకాంక్షించారు.

యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూల్స్ తీసుకొస్తే బీజేపీ దానిని ఎత్తేసిందన్నారు. నిరుద్యోగుల్లో భ్రమలు కల్పించడం సరికాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక శాతం కంటే తక్కువగానే ఉన్నారని చెప్పారు. కేంద్రంలో ఉన్న పార్టీల ఫ్యూడల్ వైఖరి పోవాలన్నారు.నిరుద్యోగభృతి వచ్చే ఏడాది నుండి ప్రారంభమవుతుందన్నారు. పది లక్షల మందికి నిరుద్యోగభృతి అందుతుందన్నారు.

- Advertisement -