కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా ప్రధానతారాగణం. ఇటీవలే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకాభిమానుల నుంచి, పరిశ్రమ నుంచి చక్కని ప్రశంసలు దక్కాయి. `ఓ పిల్లా నీ వల్లా` పోస్టర్ ఆసక్తి రేకెత్తించిందని ప్రశంసించారంతా. తాజాగా ఈ సినిమా టీజర్‌ని `శతమానం భవతి` వంటి బ్లాక్‌బస్టర్‌తో తారాపథంలోకి దూసుకొచ్చిన మెస్మరైజింగ్ స్టార్ శర్వానంద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – “టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకులు వైవిధ్యాన్ని, కొత్తదనాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పెద్ద హిట్టవుతుందన్న నమ్మకం ఉంది. దర్శకనిర్మాత కిషోర్‌కి అభినందనలు“ అన్నారు.
చిత్ర దర్శక నిర్మాత కిషోర్ మాట్లాడుతూ – “ఓ పిల్లా నీ వల్లా.. చక్కని లవ్, కామెడీ -యాక్షన్ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాల్ని మెప్పించే చిత్రమిది. ఫిబ్రవరిలో ఆడియో,మార్చిలో సినిమాను రిలీజ్ చేస్తాం. పూరి ఆవిష్కరించిన పోస్టర్‌కి చక్కని ప్రశంసలు వచ్చాయి. అలాగే మెస్మరైజింగ్ స్టార్ శర్వానంద్ లాంటి సక్సెస్‌ఫుల్ హీరో మా సినిమా టీజర్‌ని ఆవిష్కరించడమే ఓ పెద్ద సక్సెస్‌గా భావిస్తున్నాం. శర్వాకి ప్రత్యేక ధన్యవాదాలు“ అన్నారు.
కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చౌరాసియా , సూర్య శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మదినేని, కరుణాకర్ అడిగర్ల, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర సినిమాటోగ్రఫీః షోయబ్ అహ్మద్ కె.ఎం., ఎడిటర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మధు పొన్నాస్, నిర్మాతః కిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంః కిషోర్.