తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్ సెల్వం, వీకే శశికళకు మధ్య హోరా హోరీ కొనసాగుతుంది. ఒక విధంగా ముఖ్యమంత్రి పదవి నీదా నాదా అంటూ సవల్ విసురుకుంటున్నారనే చెప్పుకొవచ్చు. ఇప్పటికే సీఎం పదవి దక్కించుకోవాలని శశికళ తన ప్రయత్నలు ముమ్మరం చేస్తుంది. ఓ వైపు అసెంబ్లీలో బల పరీక్షకు తాను సిద్ధంమంటూ పన్నీరు సెల్వం ప్రకటన చేశారు. ఇలా గంట గంటకు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు వెడెక్కుతున్నాయి.
అయితే ఈ క్రమంలోనే తమిళనాడు రాజకీయాలపై విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ పరోక్షంగా ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వానికి మద్దతునిచ్చారు. పన్నీర్ సెల్వం రాష్ట్రానికి మంచి చేస్తున్నారు…నేను ఆయన అభిమానిని కాదు, మేం స్తబ్దుగా ఉండటం వల్లే ఇలాంటి పరిమాణామాలను సహిస్తున్నాం అంటూ కామెంట్ చేశారు. తమిళనాడుకు దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నాయంటూ ఆయన పెర్కొన్నారు.
దీనికంటే ముందు నటుడు కమల్ హాసన్ ట్వీట్లర్ వేదికగా పలు ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. శశికల్,పన్నీర్ సెల్వం విషయంలో అభిప్రాయభేదాలు ఉన్నంత మాత్రాన తమిళనాడును నిట్టనిలువునా చీల్చవద్దంటూ ఆయన ట్వీట్లో పెర్కొన్నాడు. ప్రస్తుతం తమిళనాట రాజకీయ పరిణామాలపై సినీనటులు స్పందిస్తే బాగుంటుదని,…కనీసం ఫేస్‌బుక్‌లో డబ్‌స్మాష్ వీడియోలైనా పెట్టాలని కమల్ హాసన్ కోరారు. అహింసయుతంగా పోరాడితే యావత్ దేశం తమిళనాడుకు అండగా నిలుస్తుందని…. దొడ్డి దారిన రాజకీయం చేసే రాజకీయ నాయకులను నమ్మడం ద్వారా మన స్వాతంత్ర్యాన్ని కొల్పోతున్నామని, ఇకనైన వారిని వేలెత్తిచూపే ముందు మనమే సరిగ్గా ఉండటం నేర్చేకుందామంటూ ట్వీట్లు చేశాడు.
ఇక సోషల్ మీడియాలో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఎవరి కూర్చుంటే బాగుంటుది అనే దానిపై ప్రజా అభిప్రాయసేకరణ చూస్తే పన్నీర్‌సెల్వంకే ఎక్కువ మద్దతు లభిస్తుంది. మరి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.