ఓ బేబి ప్రీ రిలీజ్‌..అతిథులుగా వెంకీ,రానా

442
o baby
- Advertisement -

టాలీవుడ్‌ బ్యూటీ అక్కినేని స‌మంత -నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబి’. జూలై 5న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా మూవీ ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేసింది చిత్రయూనిట్. హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ వేడుక జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విక్టరీ వెంకటేష్‌,రానా అతిథులుగా రానున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత స్వాతి అనే క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెర‌కెక్కించారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేసింది.

ట్రైలర్‌లో.. ‘తెల్లవారుజామున నాలుగు గంటలకు సన్నటి వర్షం.. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ. బేబీ 70 ఏళ్ల ముసల్ది కాదు. 24 ఏళ్ల పడుచు పిల్ల’ అని రాజేంద్ర ప్రసాద్‌.. రావు రమేశ్‌తో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘దేవుడు మళ్లీ వయసిచ్చాడు. ఆ వయసు మళ్లీ రెక్కలు విప్పుకొంటుంది’ అంటూ సమంత ఏడుస్తూ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

- Advertisement -