ప్రేయసిని పెళ్లాడిన స్టార్ క్రికెటర్!

97
nz
- Advertisement -

కివీస్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథి తన ప్రేయసిని పెళ్లాడి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 33 ఏళ్ల వయసులో తాను చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రయాను సౌథీ పెళ్లి చేసుకున్నాడు. ఈ మేరకు తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు షేర్ చేశాడు.

ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కొత్త దంపతులకు 2017లో ఇండీ మే సౌతీ, 2019లో స్లోయానే అవా సౌతీ జన్మించారు. ఇప్పుడు సౌతీ, బ్రయా జంట తమ రిలేషన్‌లో మరో అడుగు ముందుకేసి పెళ్లి చేసుకుంది.

న్యూజిలాండ్ తరపున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 5 హాఫ్ సెంచరీలతో 1769 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరఫున ఆడాడు.

- Advertisement -