‘బంగార్రాజు’ నుండి చివరి సాంగ్‌ వచ్చేసింది..

60
- Advertisement -

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, యువ సామ్రాట్‌ నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. ఈ చిత్రంలోని పాటలను ఇటీవల వరుసగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని చివరి పాటను కూడా రిలీజ్‌ చేశారు. ‘నువ్వు సిగ్గుపడితే’ అనే ఈ పాటను చిత్రబృందం శనివారం యూట్యూబ్‌లో వదిలారు. అనూప్ రూబెన్స్ బాణీలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. చిత్ర, సాయిచరణ్, రమ్య బెహరా ఆలపించారు.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు చిత్రం ఈ సంక్రాంతికి రిలీజైన హిట్ టాక్‌ తెచ్చుకుంది. నాగ్ సరసన రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతిశెట్టి నటించారు. ఈ చిత్రాన్ని జీస్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించింది.

- Advertisement -