రాహుల్ ప్రధాని అయితే చనిపోతారు..!

337
dr nehru
- Advertisement -

రాహుల్ గాంధీ ప్రదానమంత్రి అయితే మరణించే అవకాశాలు ఎక్కువ అన్నారు న్యూమరాలజిస్ట్ నెహ్రు. న్యూమరాలజీ ప్రకారం ఎవరు పీఎం,సీఎం అయ్యే అవకాశం ఉందనే దానిపై ఓ టీవీ చానల్ జరిపిన చర్చలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రాహుల్ ప్రధాని అయితే..మరణించే అవకాశాలే ఎక్కువ అన్నారు నెహ్రు. రాహుల్ గాంధీ పేరు ప్రకారం 58 నెంబర్‌ వస్తుందని..సంఖ్యా పరంగా పరిశీలిస్తే 13 నెంబర్ వస్తుందన్నారు. ఈ నెంబర్ ప్రమాదకరమని అందుకే ఒకవేళ రాహుల్ ప్రధానమంత్రి అయితే చనిపోయే అవకాశాలు ఎక్కువ అన్నారు.

రాజీవ్ గాంధీ న్యూమరాలజీ పరిశీలిస్తే ఇదే అర్ధం అవుతుందన్నారు. ఇదే సంఖ్యా బలాన్ని కలిగిన ఉన్న రాజీవ్ ..అందుకే బాంబు బ్లాస్టులో చనిపోయారని నెహ్రు వెల్లడించారు..

గాంధీ అనే పేరులోనే భయంకరమైన నెంబర్ ఉందని అందుకే గాంధీ అనే వాళ్లు చంపబడుతున్నారని చెప్పారు. మహాత్మగాంధీ,ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ అందరిని చంపేశారన్నారు. అయితే ఈ చర్చలో పాల్గొన్న ఇద్దరు న్యూమరాలజీస్టులు ఒకరు జగన్ సీఎం అవుతారని చెప్పగా మరొకరు చంద్రబాబు సీఎం అవుతారని చెప్పడం విశేషం.

- Advertisement -