25 నుండి నుమాయిష్ పునఃప్రారంభం..

120
- Advertisement -

ఈనెల 25 నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ పునఃప్రారంభం కానుంది. జనవరి 1న ప్రారంభించి, జనవరి 3నుండి కరోనా ప్రభావంతో నుమయిష్ కమిటీ మూసివేసింది.. కరోనా ఆంక్షలు తొలగటంతో మళ్ళీ నుమయిష్ ప్రారంభించాలని కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనుమతి మేరకు.. తిరిగి నుమాయిష్ ప్రారంభిస్తున్నట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.

ఫిబ్రవరి 25వ తేదీ నుండి 45 రోజుల పాటు నిర్వహించనున్నారు. 2000 స్టాల్స్ తో ఈ నుమాయిష్ తిరిగి ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి 11 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. జనవరి 1న ప్రారంభమైన ఎగ్జిబిషన్..రాష్ట్రంలో ఒమిక్రాన్ – ( కోవిడ్ 19 ) కేసులు పెరిగిన నేపథ్యంలో రద్దు చేసిన సొసైటీ వెల్లడించింది.

- Advertisement -