- Advertisement -
జనవరి 1వ తేది నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ప్రారంభమవుతుందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. హైద్రాబాద్ లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం ఈ నుమాయిష్ ఉపయోగపడుతుంది. నుమాయిష్ నుండి వచ్చే ఆదాయం తెలంగాణ అంతటా ఉన్న 18 విద్య సంస్ధలకి నాణ్యమయిన విద్యని అందించడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
మెట్రో రైల్ కూడా ఏక్సిబిషన్ గ్రౌండ్ దగ్గర్లో ఉండడం వలన పబ్లిక్ సౌకర్యం కోసం అదనపు మెట్రో రైల్ లని కూడా నడపడానికి హెచ్.ఎమ్.ఆర్ అంగీకరించింది. గత ఏడాది జరిగిన ప్రమాదం దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నాం. 3 కోట్ల రూపాయలతో అగ్నిమాపక మౌలీక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి స్టాల్ లో మంటలు అర్పడనికి సదుపాయాలతో పాటు భీమా కూడా చేయించామని చెప్పారు.
- Advertisement -