నుమాయిష్ ఎగ్జిబిషన్‌ ప్రారంభం..

694
Numaish Exhibition
- Advertisement -

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్ ) ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి హోం శాఖ మంత్రి మహమూద్‌ ఆలి,పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజులపాటు ఎగ్జిబిషన్‌ మైదానంలో నుమాయిష్‌ నిర్వహణ జరుగుతుంది.

- Advertisement -