- Advertisement -
హైదరాబాద్ నాంపల్లిలో ఇటీవలె నుమాయిష్ 2025 ముగిసిన సంగతి తెలిసిందే. నుమాయిష్ నేపథ్యంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 247 మందిని షీ టీమ్స్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
జనవరి 3 నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగిన నుమాయిష్‌లో మొత్తంగా 37 కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఇద్దరు నిందితులకు 2 రోజుల జైలు శిక్ష, 33 మందికి రూ.1,050 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.
నిందితుల్లో 190 మందిని హెచ్చరికతో వదిలిపెట్టామని చెప్పారు. ప్రస్తుతం మరో 20 కేసులు విచారణ స్థాయిలో ఉన్నాయన్నారు. పట్టుబడ్డ 247 మందిలో 223 మంది పెద్దవారు, 24 మంది మైనర్లు ఉన్నారని తెలిపారు.
Also Read:LRS పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్!
- Advertisement -