అమెరికాపై అణుబాంబు..!

228
What nuclear war between the US and North Korea might look like
What nuclear war between the US and North Korea might look like
- Advertisement -

అమెరికా చేతిలో ఉన్న ఓ ద్వీపంపై అణుబాంబు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించి సంచలనం రేపింది. మంగళవారం నాడు ట్రంప్, ఉత్తర కొరియాపై విరుచుకుపడుతూ, తమను ఉద్దేశించి మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ, రెచ్చిపోతే అంతు చూస్తానని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. అమెరికా అధీనంలోని ద్వీపంపై అణు దాడి చేస్తామని ఉత్తర కొరియా ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. కిమ్ ను మంటల్లో కలిపేస్తానని హెచ్చరించారు. ఉత్తర కొరియా ఒక్క అడుగు వేయాలని చూసినా, అడుగు పడేలోపే ఆ దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు.

north-korea-warhead

దీనిపై స్పందించిన నార్త్‌ కొరియా తమ ప్లాన్ కు అధినేత కిమ్ జాంగ్ ఉన్ నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రపంచ పటం నుంచి గువాం కనిపించకుండా పోతుందని ఉత్తర కొరియా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పసిఫిక్ మహా సముద్రంలోని అమెరికా అధీనంలో ఉన్న గువాం ద్వీపం తమకు 2,128 మైళ్ల దూరంలో ఉందని, ఆ ద్వీపాన్ని సర్వ నాశనం చేసి చూపిస్తామని తెలిపారు. ఈ ఐలాండ్ తీరంలో యూఎస్ కు చెందిన సబ్‌ మెరైన్ల స్క్వాడ్రన్‌, ఒక ఎయిర్‌ బేస్‌, కోస్ట్‌ గార్డు గ్రూపులున్నాయని, ఒకవేళ గువాంపై దాడిని అమెరికా అడ్డుకుంటే, తమ తరువాతి టార్గెట్ ఆ దేశ ప్రధాన భూభాగమే అవుతుందని హెచ్చరించారు.

guam2

గువామ్ ద్వీపం 541 స్క్వేర్ కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న‌ది. పిలిప్పీన్స్‌, హ‌వాయి మ‌ధ్య ఉన్న ప‌సిఫిక్ స‌ముద్రంలో ఈ దీవి.. ఒక అగ్నిప‌ర్వ‌త ప్రాంతం. కోర‌ల్ ఐలాండ్ కూడా. అమెరికా ఆధీనంలో ఉన్న ఈ గువామ్ దీవిలో సుమారు ల‌క్షా 63 వేల మంది నివ‌సిస్తున్నారు. ఐలాండ్‌లో సుమారు పావు వంతు ప్రాంత‌ంలో మిలిట‌రీకి చెందిన ఆరు వేల మంది ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే ఐక్య‌రాజ్య స‌మితి కూడా నార్త్ కొరియాపై ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. అయినా ఆ దేశం మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఏకంగా అగ్ర‌రాజ్య మిలిట‌రీ స్థావ‌రాల‌పైనే దాడికి ప్ర‌ణాళిక ర‌చిస్తుండ‌టం ప్ర‌పంచ దేశాల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.

American bombers

గువాంపై ఉత్తరకొరియా అణుదాడి చేసే ప్లాన్‌ను రచిస్తున్నామని ప్రకటించక ముందే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యాయి. భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దాదాపు 10 గంటల పాటు అమెరికాకు చెందిన సూపర్‌సోనిక్‌ బాంబర్‌ జెట్లు గువాం మీదుగా పలుమార్లు గాల్లో చక్కర్లుకొట్టాయి.

Nuclear war heads

దాడి జరిగితే అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని .. అందుకోసమే 10 గంటలపాటు పైలట్లు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా అమెరికా విశ్వరూపాన్ని యుద్ధంలో ఉత్తరకొరియా చూస్తుందని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమెరికా వ్యూహానికి అద్దంపడుతున్నాయి. కాగా, గువాం గవర్నర్‌ అమెరికాను యుద్ధంలో గెలుస్తుందని బుధవారం వ్యాఖ్యానించారు. గువాంపై దాడి చేసేందుకు ఉత్తరకొరియా దాదాపు 60 న్యూక్లియర్‌ వార్ హెడ్‌లను సిద్ధం చేసిందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -