ఎన్టీఆర్ గడ్డం ఎందుకు పెంచుతున్నాడు..

580
ntr
- Advertisement -

వరుసగా మూడ్ హిట్స్ కొట్టి మంచి ఊపు మీదున్న ఎన్టీఆర్ క్రేజ్ టెంపర్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు త్రిబుల్ అయిపోయింది. ఆ క్రేజ్‌తో ఏ మాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ మాత్రం తన టైం మొత్తాన్ని ఫ్యామిలీ కోసం కేటాయిస్తున్నాడు.అయితే ఎన్టీఆర్‌కి ఇప్పుడున్న క్రేజ్ దృష్ట్యా ఎన్టీఆర్ నుంచి ప్రతి వార్త కూడా సంచలనమైపోతోంది.జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఎవరితో అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ తో ఉంటుందని ఆ మధ్య ప్రచారం జరిగినా…ప్రస్తుతానికి వీరి కాంబినేషన్‌లో సినిమా లేదన్న విషయం స్పష్టం అయింది.

NTR's Shocking New Look

ఇప్పుడు ఎన్టీఆర్ ఫొటో ఒకటి అదే రేంజ్‌లో హల్చల్ చేస్తోంది. ఫుల్లు గడ్డంతో యోగిలా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంది. అయితే ఫేస్‌లో మాత్రం మాంచి కళ ఉట్టిపడుతోంది. ఇలాంటి వెరైటీ గెటప్‌లో ఎన్టీఆర్ ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదు. అందుకే ఇప్పుడు ఈ గెటప్ చుట్టూ బోలెడన్ని సంచలన వార్తలు పుట్టుకువస్తున్నాయి. ఇటీవల మంత్రి తలసాని కూతురి వివాహానికి హాజరైన ఎన్టీఆర్‌ న్యూలుక్‌లో సందడి చేశాడు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ఎన్టీఆర్‌ మీదే పడ్డాయి.

NTR's Shocking New Look

దీంతో ఎన్టీఆర్‌ న్యూలుక్ పై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. తమిళ్ డైరెక్టర్ బాల సినిమా కోసమే ఎన్టీఆర్ గెడ్డం పెంచుతున్నాడని కూడా చాలా మంది చెప్తున్నారు. ఒక వేళ బాలతో సినిమా కాకపోయినా ఎన్టీఆర్ చేయబోయే కొత్త సినిమాలో ఈ గెటప్‌తో కనిపించడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇజం సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌‌కి వచ్చినప్పుడు ఉన్న గడ్డాన్ని, ఈ గడ్డాన్ని పోల్చి చూస్తే మాత్రం ఈ గడ్డం గెటప్ లేటెస్ట్‌దే అని తెలుస్తోంది.

NTR's Shocking New Look

అంతకముందు వివిధ రకాల పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. అదుర్స్ లో బ్రాహ్మణ యువకుడి పాత్ర ద్వారా తనలోని కొత్త షేడ్ ను చూపిన ఎన్టీఆర్…తర్వాత బాద్ షా,టెంపర్‌,నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్‌ మూవీల్లో డిఫరెంట్ గెటప్స్‌తో కనిపించి అలరించాడు.

NTR's Shocking New Look

తాజాగా పూర్తిగా రగ్గుడ్ గా పెరిగిన గడ్డంతో , మీసాలతో సరికొత్త ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు . పూర్తి మాస్ అవతార్ గా ఎన్టీఆర్ కనిపిస్తున్న తీరు కి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు . అసలే ఎన్టీఆర్ అంటే మాస్ , ఇక ఈ గెటప్ చూస్తే ఊర మాస్ లాగా ఉంది అంటే ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి ఇదే గెటప్ కనుక అయితే బాక్స్ లు బద్దలు కావడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్ . ఇప్పటికే నాన్నకు ప్రేమతో చిత్రంలో సరికొత్త గెటప్ తో యావత్ సినీ ప్రేక్షకులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు గడ్డం,మీసంతో మరింత సంచలనం సృష్టిస్తున్నాడు.

- Advertisement -