- Advertisement -
వినాయక చవితి పండగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని `జై`, `లవ` పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్లను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
గురువారం రెండో టీజర్‌తో సాఫ్ట్ క్యారెక్టర్‌తో దిగిపోయిన ఎన్టీఆర్.. ‘జై లవ కుశ’ సినిమాలో తన మూడో పాత్ర `కుశ` ఫస్ట్‌లుక్‌ను ఎన్టీఆర్ విడుదల చేశాడు. మొదట వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన ఆయన కొద్ది నిమిషాల్లో చిన్న సర్‌ప్రైజ్ ఇస్తానని అందులో పేర్కొన్నారు. తర్వాతి ట్వీట్‌లో `కుశ` ఫస్ట్‌లుక్ విడుదల చేసి, అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌నే ఇచ్చాడు. ఈ పోస్టర్‌లో తారక్ ట్రెండీ లుక్‌లో కనిపిస్తున్నాడు.
#KusaFirstLook pic.twitter.com/pYuLvyIooW
— Jr NTR (@tarak9999) August 25, 2017
- Advertisement -