ఎన్టీఆర్ బయోపిక్ టీజర్.. రాబోతుంది?

182
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్‌ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు పొలిటికల్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను తెరమీద ఆవిష్కరించేందుకు దర్శకులు పోటీ పడుతున్నారు. మొదట ఎన్టీఆర్ తనయుడు,ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపగా తర్వాత వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సైతం ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించి అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్నారు. తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కబోతోంది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ మూడు ముక్కలాటగా మారింది.

NTR's Biopic Teaser Soon!

దాదాపుగా మూడు చిత్రాల షూటింగ్ లు కూడా ఒకే సారి మొదలయ్యే అవకాశం ఉందని చిత్ర వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారథ్యంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ టీజర్ లను విడుదల చేయలేదు. వచ్చే ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండడంతో ఈ లోపు ఓ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తేజ ఓ ఆసక్తికర టీజర్ ను రూపొందించాడని వినికిడి. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ టీజర్ ను విడుదల చేసేందుకు తేజ రెడీగా ఉన్నారట.

ఈ సినిమాలో ఏఏ అంశాలను ప్రస్తావించబోతున్నారో ఆ టీజర్ లో చూపించబోతున్నారట. మహానటుడు ఎన్టీఆర్ కు సంబంధించిన కీలకమైన ఫోటోలతో పాటు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన డైలాగ్స్ తో కలిపి ఈ టీజర్ ని రూపొందించారట. ఈ టీజర్ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి నేపథ్య సంగీతం అందించారని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య తన తదుపరి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారని ఆయనకు టీజర్ చూపించిన తర్వాత విడుదల చేసేందుకు తేజ ప్లాన్ చేస్తున్నారట. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నానంటూ వర్మ…. జై ఎన్టీఆర్….జై ఎన్టీఆర్….పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వర్మ …లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తేజ విడుదల చేయబోయే ఈ టీజర్‌ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

- Advertisement -