ntr30:’ఎన్టీఆర్ 30′ కి అదనపు అందాలు!

46
- Advertisement -

కొరటాల శివ, ఎన్టీఆర్ 30 కోసం ప్రస్తుతం అదనపు అందాలు అద్దె ప్రయత్నం చేస్తున్నాడు. తన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘పాన్ ఇండియా సినిమా’ సినిమా కోసం కొరటాల శివ గ్లామర్ డోస్ ను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో కొరటాల శివ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెడుతున్నాడు. అందుకే, తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కూడా నటించబోతుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో మలైకా అరోరా పై ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు.

ఐతే, ఎన్టీఆర్ సరసన ఇలా మలైకా అరోరా పేరు వినిపిస్తూ ఉండేసరికి, ఇంకా ఎంత మంది హీరోయిన్లు ఉన్నారు ఈ సినిమాలో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ను ఫైనల్ చేశారు. కానీ.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి కూడా మంచి స్కోప్ ఉంది. అందుకే.. కృతి శెట్టి, అనన్య పాండే ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. తాజాగా స్పెషల్ సాంగ్ కోసం ఇప్పుడు మలైకా అరోరా పేరు కూడా వినిపిస్తోంది.

మొత్తానికి ఈ సారి కొరటాల శివ గ్లామర్ డోస్ ను బాగా పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే బాగా ఆలస్యం అయిన ఈ సినిమా నిన్న పూజా కార్యక్రమాలతో మొదలైంది. వచ్చే ఏడాది సమ్మర్ లో విజయదుందుభి మోగించడానికి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ చేయాలని కొరటాల శివ ప్లాన్. మరి ఏమవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

Manchu Brothers:మంచు బ్రదర్స్ .. గొడవేంటి?

Mohan Babu:విష్ణు-మనోజ్‌ గొడవపై మోహన్ బాబు సీరియస్

Manchu Manoj:షాకింగ్ : మనోజ్ పై విష్ణు దాడి

- Advertisement -