NTR30 ఇంకా ఆలస్యం ?

35
- Advertisement -

ఎన్టీఆర్ , కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ NTR30 షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. నిజానికి ఈ పాటికి ఈ సినిమా సెట్స్ పైకి రావల్సింది. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి చాలా నెలలవుతుంది కానీ ఇంత వరకు షూటింగ్ మొదలు కాలేదు. చిరంజీవి తో కొరటాల శివ తీసిన ‘ఆచార్య’ డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా రిజల్ట్ తర్వాత కొరటాల లెక్కలు మారాయి. అప్పటి వరకు ఒక్క ఫ్లాప్ లేకుండా కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చిన కొరటాలకు ఆచార్య రూపంలో పెద్ద బ్రేక్ పడింది. ఇప్పుడు ఆచార్య ను ఆ మరిచేలా ఓ అదిరిపోయే సినిమాతో రావాలని కొరటాల భావిస్తున్నాడు.

ఇందుకోసమే పదే పదే స్క్రిప్ట్ రిపేర్లు చేస్తున్నాడు. ఇక తారక్ , కళ్యాణ్ రామ్ కూడా ఎప్పటికప్పుడు కొరటాల కి సజీషన్స్ ఇస్తూ వస్తున్నారట. అలాగే టీమ్ తో ఎప్పటికప్పడు బెస్ట్ ఔట్ పుట్ తీసుకుంటూ కొరటాల ముందుకెళ్తున్నాడు.

ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. RRR తర్వాత తన నుండి రాబోయే పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ కొరటాలతో డిస్కషన్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలు కానుందని వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది ఎన్టీఆర్ ప్రకటించారు.

కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఈ నెలాఖరున పూజా కార్యక్రమాలు ఉంటాయి కానీ షూటింగ్ కి ఇంకా టైం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఎన్ టి ఆర్ కూడా లేటయినా పర్లేదు కానీ సాలిడ్ కంటెంట్ తోనే వెళ్దాం అంటూ టీంతో చెప్తూనే ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి మేకర్స్ ఘాట్ పై క్లారిటీ ఇస్తూ అప్ డేట్ ఎప్పుడు వదులుతారో అంటూ తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

మార్చిలో వస్తున్న “వీరఖడ్గం”

పిక్ టాక్ : బాబోయ్ ఒళ్ళు విరుచుకుంది

RC15 మళ్లీ లాంగ్ బ్రేక్ !

- Advertisement -