ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ చేస్తున్న సినిమాలో రెండో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది. అయినా, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలో రెండో హీరోయిన్ ఉండటం సహజం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాలో కూడా రెండో హీరోయిన్ పాత్ర వుంది, ఆ పాత్ర కు బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకున్నారు. కుర్రకారు గుండెల్ని తన ఫోజులతో పట్టేసిన అమ్మడు అనన్య. లైగర్ లో విజయ్ దేవరకొండ సరసన నటించి మెప్పించింది.
ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ సినిమాలోకి చేరిపోయింది. కొరటాల శివ ఓ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాను ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ నుంచి సెట్ మీదకు వెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో జాన్వీ కపూర్, లేదా కియారా అద్వానీలలో ఒకర్ని మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ చేయనున్నారు. ఇక రెండో హీరోయిన్ గా అనన్య పాండే అన్నమాట.
అలాగే ఈ సినిమా కోసం ఓ సీనియర్ హీరోయిన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇవన్నీ ఇలా వుంచితే కొరటాల శివ ఈ సినిమాలో ఓ ప్యూర్ ఐటమ్ సాంగ్ ను తన సినిమాలో చూపించబోతున్నారు. ఈ సాంగ్ లో పూజా హెగ్డేను ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ సినిమా అందివ్వాలని కొరటాల డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది ఈ ఏర్పాట్లు అన్నీ గమనిస్తుంటే. ఈ సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా బజ్ ఉంది.
ఇవి కూడా చదవండి….