అరవింద సమేత ప్రీరిలీజ్‌…ఎన్టీఆర్ కంటతడి

758
ntr
- Advertisement -

ఓ మనిషి బ్రతికి ఉన్నప్పుడు అతడి విలువ తెలియదని… చనిపోయిన తర్వాత తెలుసుకున్నా వారు మన మధ్యలో ఉండరని భావోద్వేగంతో అన్నారు హీరో ఎన్టీఆర్. హైదరాబాద్‌లో అరవింద సమేత ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హరికృష్ణ గుర్తొచ్చినప్పుడల్లా భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశారు. ఎన్టీఆర్ మాటల్లో వణుకు, కళ్లల్లో నీళ్లు, ప్రతి
మాటలోనూ భావోద్వేగం…ఎన్టీఆర్ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

ఈ జీవితం మీకే అంకితమని చెప్పారు ఎన్టీఆర్. త్రివక్రమ్‌తో సినిమా చేయాలన్నది నా 12 ఏళ్ల కల అని అది ఇప్పటికి నెరవేరిందన్నారు. . ఇన్నేళ్ల ప్రయాణంలో త్రివిక్రమ్‌లో ఓ మంచి స్నేహితుడిని, దర్శకుడిని చూశాను . ఈ సినిమా ముగిసేలోపు ఆత్మబంధువుగా మారిపోయారు. విషాద సమయంలో నాకో సోదరుడిగా, తండ్రిగా అండగా నిలిచారు. నా జీవితంలో నెల రోజుల
క్రితం జరిగిన సంఘటనతో ఈ చిత్రం ముడిపడి ఉంది. త్రివిక్రమ్‌తో సినిమా మొదలుపెట్టిన తర్వాతే జీవితం విలువ తెలిసిందన్నారు.

aravinda sametha pre release

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -