ఎన్టీఆర్ vs బన్నీ.. పోటీ తప్పదా?

30
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు అగ్రహీరోలే. పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు తిరగరాసే సత్తా ఉన్న హీరోలే. ఇలాంటి వీరిద్దరు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగితే ఎలా ఉంటుంది ? ఇంకేముంది ఇండియన్ బాక్సాఫీస్ కు రికార్డుల ఊచకోతే. మరి నిజంగానే ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ పై దండెత్తబోతున్నారా ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ” దేవర ” అనే సినిమా చేస్తున్నాడు. పవర్ ప్యాక్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రెల్ 5 న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు. .

అందుకు తగ్గట్టుగానే శరవేగంగా షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నాడు ఎన్టీఆర్. ఇంకా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తుండడంతో దేవర మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు పుష్ప మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ బెండు తీసిన అల్లు అర్జున్ దానికి సిక్వల్ గా పుష్ప 2 మూవీ చేస్తున్నాడు. మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండో పార్ట్ ను మరింత జాగ్రత్తగా తీస్తున్నారు దర్శకుడు సుకుమార్.

ఎక్కడ కంప్రమైజ్ కాకుండా క్వాలిటీ విషయంలో అన్నీ పక్కా కుదిరకే మూవీని విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. అందుకే ఈ మూవీని మొదటి ఈ ఏడాది డీసెంబర్ లో రిలీజ్ చేయాలని భావించినప్పటికి.. సమ్మర్ కు పోస్ట్ పోన్ చేసినట్లు వినికిడి. అన్నీ కుదిరితే ఏప్రెల్ రెండో వారంలో పుష్ప 2 ను విడుదల చేయాలని మేకర్ భావిస్తున్నారట. అదే గనుక జరిగితే వారం గ్యాప్ లో ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశం ఉంది. మరి రెండు పాన్ ఇండియా చిత్రాలే కావడంతో రెండు మూవీస్ పైన హైప్ బాగానే ఉంది. మరి నిజంగానే ఈ రెండు సినిమాలు సమ్మర్ లో పోటీ పడతాయో లేదా వెనక్కి తగ్గుతాయో చూడాలి.

Also Read:సీట్లు తేల్చే పనిలో పవన్?

- Advertisement -