సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన సర్పంచ్‌లకు రూ. 15 లక్షల రూపాయలు అందిస్తామని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 15 లక్షలు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువని వెల్లడించారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా చూసుకోవాలన్నారు. లక్ష్మీపూర్ తండా స్ఫూర్తితో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం కావాలన్నారు కేటీఆర్. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.
ముందస్తు ఎన్నికలకు పోయి గెలిచిన ఘనత సీఎం కేసీఆర్ ది అని తెలిపారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతను దేశం మొత్తం గుర్తిస్తోందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని పలు రాష్ర్టాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. రైతుబంధు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని ప్రధాని మోడీ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గ TRS కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తూ… pic.twitter.com/ozUQ5NSMBG
— KTR (@KTRTRS) January 3, 2019