2021సంక్రాంతికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ!

407
NTR-Trivikram
- Advertisement -

అల..వైకుంఠపురంలో సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈమూవీ తర్వాత త్రివిక్రమ్ ఎవరితో చేస్తాడన్నది ఆసక్తి నెలకొంది. తాజాగా ఉన్న సమచారం మేరకు ప్రభాస్ లేదా ఎన్టీఆర్ తో చేయనున్నాడని తెలుస్తుంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ మూవీలో నటిస్తున్నాడు. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈమూవీ దసరాకు విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రానుందని సమచారం.

అయితే అంతలోపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాల టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈమూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరో నెల రోజుల్లో ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళ్లొచ్చు అనే ఆసక్తిని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్క్రిప్ట్ ను ఏప్రిల్ నాటికి సిద్ధం చేసుకుని, సెట్స్ పైకి వెళ్లేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది.

- Advertisement -