ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ కండీషన్..?

189
Trivikram and Jr NTR's film
- Advertisement -

టాలీవుడ్‌ తలైవా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. 2013లోనే మొదలు కావాల్సిన వీళ్ల కాంబినేషన్‌ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రిపరేషన్‌లో ఉన్నాడట త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. అందులో భాగంగానే ఎన్టీఆర్‌ను ఓ కోరిక కోరుతూ ఓ కండీషన్‌ పెట్టాడట త్రివిక్రమ్‌. సినిమాకి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని తెలుస్తుండగా, ఇందులో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ డిఫరెంట్ గా చూపించాలని భావిస్తున్నాడట.

అందుకోసం బరువు తగ్గాలనీ .. మరింత ఫిట్ గా కనిపించాలని త్రివిక్రమ్ సూచించాడట. దాంతో డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిపుణుల పర్యవేక్షణలో జిమ్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడట ఎన్టీఆర్ . ఈ సినిమాను నవంబర్ లో ప్రారంభించాలని ముహూర్తం కూడా పెట్టేసుకున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమా చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరి దశకి చేరుకుంది.

- Advertisement -