వైజయంతి బ్యానర్‌లో యంగ్‌టైగర్..

196
Ntr to Join hands with mega pruducer
- Advertisement -

నందమూరి తారకరామారావు నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు అనేక విజయవంతమైన సినిమాలు చేసిన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎందరో టాప్ హీరోల సినిమాలను నిర్మించి విజయపథంలో దూసుకుపోతోంది ఈ నిర్మాణ సంస్థ. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం1’ సినిమాకు తన అనుబంధ సంస్థ అయిన స్వప్నసినిమాలో ఈ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు.

 Ntr to Join hands with mega pruducer

తాజాగా ఎన్టీఆర్‌తో మరో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత అశ్వినీదత్ ప్లాన్‌లో ఉన్నారట. ఈ సినిమాకు సంబంధించి దర్శకుల ఎంపికలో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమచారం. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఈ సినిమా పూర్తి వివరాలను అందజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జైలవకుశ’ సినిమా గ్యాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హేగ్డే నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫీల్మ్ సిటీలో శరవేగంగా జరుపుకుంటుంది.

- Advertisement -