ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, మళ్ళీ చాలా కాలం తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న సినిమా గురించి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ హీరో యష్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో యష్ విలన్ క్యారెక్టర్ కు ఒప్పుకుంటాడా ? డౌటే మరి.
కాకపోతే, ఇక్కడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాబట్టి.. అలాగే ఎన్టీఆర్ సినిమాలో విలన్ పాత్ర కాబట్టి.. యష్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. పైగా విలన్ అంటే విలన్ లా కాకుండా సినిమాలోనే బలమైన పాత్రగా యష్ పాత్ర ఉంటుందని టాక్. ప్రశాంత్ నీల్ అంటేనే భారీ సినిమా. ఇక ఎన్టీఆర్ సినిమా కూడా భారీగానే ఉంటుంది. మరి యష్ కూడా ఈ టీంలో జాయిన్ అయితే.. ఫుల్ కిక్ ఉంటుంది ఫ్యాన్స్ కి. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో ప్రశాంత్ నీల్ మహా దిట్ట.
కాబట్టి.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా పాక్ – ఇండియా యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా వస్తోందట. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఈ నేపథ్యంలో ఓ భారీ సినిమా రాలేదు. అందుకే ఇండియన్ తెర పై ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. మరి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి…