జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా..

42
ntr

కరోనా మహమ్మారి మరింత ఉదృతంగా మారింది. కరోనా బారినపడి ఎంతో మంది బలయ్యారు. కొవిడ్‌ సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలను కూడా భయకంపితులను చేస్తోంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరో యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు.

తాను, తన కుటుంబం ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నామని, డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ చికిత్స పొందుతున్నామని వివరించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ ప్రముఖులు సందేశాలు పంపిస్తున్నారు.