యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతుంది. ఈ చిత్రం రాయలసీమ బ్యాగ్‌డ్రప్‌లో లవ్,ఫ్యక్షన్ నేపథ్యంలో ఉండబోతుంది. ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ మరియు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్నాయి. అయితే ఈ వినాయక చవితి పండగను సందర్బంగా ఈ సినిమా నుండి కొత్త పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఓ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
ఈ చిత్రానికి సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన పోస్టర్ అని, ‘అరవింద సమేత’ ఆడియో ఆల్బమ్‌ను ఈ నెల 20న విడుదల చేస్తామని పేర్కొంది. ఈ వారంలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా పండుగకు విడుదలకానుంది.