ఫిబ్ర‌వ‌రి 22న ‘ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు’

248
Ntr Mahanayakudu
- Advertisement -

మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించ‌గా, ఆయ‌న స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ న‌టించారు. ఈసినిమాకు బాల‌కృష్ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ను రెండు పార్టులుగా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు క్రిష్. ఎన్టీఆర్ సినిమా భాగాన్ని మొత్తం క‌థానాయ‌కుడు, రాజ‌కీయ జీవితాన్ని మొత్తం మ‌హానాయ‌కుడుగా తెర‌కెక్కించారు.

NTR-Biopic

సంక్రాంతి కానుక‌గా ఎన్టీఆర్ క‌థానాయకుడు చిత్రం విడుద‌లైంది. అయితే ఆశించిన స్ధాయిలో ఈసినిమా విజ‌యం సాధించలేక‌పోయింది. డిస్ట్రీబ్యూట‌ర్ల‌కు న‌ష్టాన్నే మిగిల్చింది. ఇక ఎన్టీఆర్ మహానాయ‌కుడు సినిమాను తీర్చిదిద్దేప‌నిలో ఉన్నారు చిత్ర‌యూనిట్. ముందుగా ఈచిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేయాల‌నుకున్నారు.

కానీ షూటింగ్ పార్ట్ పూర్తికాక‌పోవ‌డంతో విడుద‌ల తేదిని వాయిదా వేసుకున్నారు. తాజాగా ఈచిత్ర విడుద‌ల తేదిని ప్ర‌క‌టించారు చిత్ర‌యూనిట్. వచ్చేనెల 22వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువడే అవ‌కాశం ఉంది.

- Advertisement -