నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటించిన సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు. ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగంగా విడుదలైంది. ఫిబ్రవరి 22న భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. నందమూరి బాలకృష్ణ NBK ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను నిర్మించారు.
ఎన్టీఆర్‌లోని మంచిని మాత్రమే చూపించారంటూ తొలిభాగంపై వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండో భాగంలో ఆయనకు ఎదురైన కొన్ని పరాభవాల్ని ప్రస్తావించారు క్రిష్. ఎన్టీఆర్, బసవతారకం మధ్య ఉన్న అనుబంధమే ప్రధాన కథాంశం అంటూ ప్రారంభంలో చిత్రబృందం చెప్పిన మాటలకు సినిమా కథకు ఎలాంటి సంబంధం కనిపించదు.
కేవలం నాదెండ్ల భాస్కర్‌రావుపై ఎన్టీఆర్ చేసిన పోరాటానికే పెద్దపీట వేస్తూ సినిమాను రూపొందించారు. నాదెండ్ల భాస్కర్‌రావును విలన్‌గా చూపించడానికే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో చివరి అంకాన్ని పూర్తిగా విస్మరించారు. తాజాగా చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలు చూపించారు. మరి ఇంకా అలస్యం ఎందుకు మీరు ఈ మేకింగ్ వీడియోను చూడండి.