ఎన్టీఆర్ – కొరటాల..ఫుల్ మాస్

1218
ntr
- Advertisement -

దర్శకుడు కొరటాల శివ సినిమా అంటే ఫ్యామిలీ ప్యాక్. భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు తీసినా, అందులో ఫ్యామిలీ టచ్ అన్నది పక్కకు జరగదు. అదే విధంగా కొరటాల యాక్షన్ జోడించినా అది మాస్ జానర్ లోకి వెళ్లదు. కానీ ఫర్ ఏ ఛేంజ్ ఈ సారి కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

వచ్చే నెలలో ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు జరిగాయి. ప్రస్తుతం రెడీ అయిన స్క్రిప్ట్ ఎన్టీఆర్ ను బాగా ఎగ్జైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత మాస్, యాక్షన్ సినిమా ఇటీవల ఎన్టీఆర్ చేయలేదు. అయితే దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేయాలి. ఐతే అది ఏ స్థాయిలో అని చర్చలు జరుగుతున్నాయి. సినిమా విడుదల టైమ్ లో బాలీవుడ్ పరిస్థితులు చూసి డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.

సినిమాలో కొరటాల శివ స్టయిల్ సోషల్ మెసేజ్ టచ్ ఈ సారి కాస్త తక్కువే వుంటుందని తెలుస్తోంది. ఆచార్య ఎఫెక్టు తర్వాత కొరటాల శివలో చాలా మార్పులు వచ్చాయట. ముఖ్యంగా సినిమాకు లీడ్ అయిన తొలిసగంలో ఫన్, లవ్, ఫ్యామిలీ జానర్ లు టచ్ చేసి, సెకండాఫ్ మొత్తం మాస్ మీద నడుస్తుందని.. అన్నిటికీ మించి ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుందని తెలుస్తొంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎంత త్వరగా ఈ సినిమా వస్తుందా అని చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

దాస్ కాధమ్కీ..ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల

సమంత షూటింగ్ కొచ్చేదెప్పుడు?

దీర్ఘాయుష్మాన్‌భవ…కైకాలకు అంకితం

- Advertisement -