ఎన్టీఆర్ తో ఓ కొలిక్కి వచ్చేసింది

245
- Advertisement -

ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా వ్యవహారం కొలిక్కి వచ్చేసింది. నాలుగు రోజుల పాటు ఎన్టీఆర్ – కొరటాల శివ ల రెగ్యులర్ సిటింగ్ ల నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి అన్ని వ్యవహారాలు పక్కాగా ఫైనల్ అయ్యాయి. ఇరువైపులా డిస్కషన్ల నేపథ్యంలో ఇరు వైపులా పలు సందేహాలకు క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా కొరటాల.. ఆచార్య సినిమా ప్లాప్ కు గల కారణాలను దృష్టిలో పెట్టుకొని.. ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ ను పక్కగా సిద్ధం చేశాడు. అలాగే సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా బజ్ రావడానికి ఎలాంటి వ్యూహాలు చేయాలి ?,

అలాగే సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? అనే అంశాల పై కూడా చర్చించారు. మొత్తానికి ఈ సినిమాకి ఎన్టీఆర్ డేట్లు కూడా ఇచ్చాడు. దీంతో సినిమా ఇక సెట్ మీదకు వెళ్లడమే బకాయి. అయితే వివిధ లాంగ్వేజ్ నటుల డేట్ లు కావాల్సి రావడం వల్ల ప్లానింగ్ కొంచెం ఆలస్యం కానుందని తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ తో పాటు హీరోయిన్ టబు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది.

ఇక జనవరి మూడో వారం నుంచి టబు – సంజయ్ దత్ లు డేట్లు ఇవ్వనున్నారు. మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కూడా ప్రారంభం అయింది. అనుధీప్ ఆల్ రెడీ ఈ సినిమా థీమ్ సాంగ్ ను కూడా రఫ్ గా కంపోజ్ చేశాడట. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ కి సంబంధించి చిన్న చిన్న పనులు వున్నాయని, అవి ఫినిష్ చేయించే పనిలో కొరటాల ఉన్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

ఛాన్స్ లు కోసమే ఎక్స్ పోజింగ్

బాలయ్య కోసం రెండు సెట్లు

ప్రేమికుల రోజు…టైటానిక్ రీరిలీజ్‌

- Advertisement -