ఎన్టీఆర్ కు కుడిభుజంగా సాయికుమార్..!

264
NTR Jai Lava Kusa
- Advertisement -

టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌ వంటి మూడు బ్యాక్ టు బ్యాక్‌ హిట్స్ తో మంచి జోరుమీదున్న ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం జైలవకుశ. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. జై క్యారెక్టర్ పూర్తి గా నెగెటివ్ షేడ్స్ లో ఉండగా , లవకుమార్ పాత్ర పూర్తి మంచితనంతో సాఫ్ట్ గా ఉంది. ఈ రెండింటికి భిన్నంగా కుశ క్యారెక్టర్ కృష్ణుడి టైపులో ఉంది. చిలిపితనం, అల్లరి, ధైర్యం అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి.

Sai-Kumar-role-

అయితే ఈ మూడు క్యారెక్టర్ల మధ్య సంబంధం ఏంటి..? అనేది పక్కన పెడితే కీలకపాత్ర పోషిస్తున్న సాయికుమార్ కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సన్నివేశాలు చూపించలేదు.కేవలం ఓ పోస్టర్ లో ఎన్టీఆర్ వెనుకాల వస్తున్నట్లు కనిపించాడు అంతే. దీంతో ప్రేక్షకుల్లో సాయి కుమార్ రోల్ గురించి చర్చ మొదలు అయ్యింది. ఈ సినిమాలో సాయి కుమార్‌ పాత్ర కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సాయికుమార్‌   జై పాత్ర చేసే అరాచకాలకు ఆయన అండగా ఉండబోతున్నారు. ఈ చిత్రంలో జై పాత్రకు కుడి భుజంగా ఉంటుందట సాయికుమార్ పాత్ర.

Sai-Kumar-role-

సాయికుమార్‌ గెటప్ ఆకట్టుకుంటోంది. ఊరికే హీరో పక్కనుండే పాత్ర కాకుండా ఆయన కథలో కీలకంగా ఉంటారట. సినిమాకు ఈ పాత్ర కూడా ఆకర్షణగా ఉంటుందంటున్నారు. ఈ రోజే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ‘జై లవకుశ’ వచ్చే గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

- Advertisement -