బాబాయ్‌తో వద్దంటోన్న ఎన్టీఆర్‌..

268
- Advertisement -

కొంత మంది దర్శక నిర్మాతలు, కొత్త సినిమాలకి రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేశారంటే ఆ డేట్‌ ని చేంజ్‌ చేసే ప్రయత్నాలు అస్సలు చెయ్యరు. కానీ సందర్భాన్ని బట్టి ఒక్కోసారి రిలీజ్‌ డేట్ ని చేంజ్‌ చేసుకోక తప్పదు.

అయితే తాజాగా యంగ్‌ టైగర్‌ మూవీ కూడా అనుకున్న అనుకున్న డేట్‌ కి రిలీజ్‌ చెయ్యలేకపోతున్నారు. దీనికి కారణం బాలయ్య సినిమా వస్తుండటమే.

ntr drops for balayya

ఇప్పటికే బాబాయ్ అబ్బాయ్ మధ్య ఏదో గ్యాప్ ఉందని వార్తలు చెక్కర్లు కొట్టిన విషయం వాస్తవమే. ఈ మధ్య కాలంలో ఇద్దరు కలిసి ఒకే వేదిక పై కనిపించిన సందర్భమే లేదు. మెగా ఫ్యామిలీ లో చిరు పవన్ కు మధ్య ఉన్న గ్యాప్ లాంటిదే బాలకృష్ణ కు తారక్ కు ఉందనే విషయం తెలిసిందే. కాగా తారక్ ఎప్పుడు తన సినిమాని బాబాయ్ బాలయ్య కు పోటీగా తీసుకొచ్చిన సందర్భాలు తక్కువ. లాస్ట్ ఇయర్ నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అయ్యాయి.

కేవలం రెండు రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల అయ్యాయి. కమర్షియల్ గా రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా నాన్నకు ప్రేమతోనే ఒకరకంగా గెలిచింది అని చెప్పాలి. కాని ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అవ్వబోతుంటే ఎన్టీఆర్ తనే స్వయంగా వద్దని చెప్పినట్టు తెలుస్తోంది.

 ntr drops for balayya

బాలకృష్ణ ‘పైసా వసూల్’ దసరా పండగకు తేవాలని నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. దానికి తగ్గట్టు షూటింగ్ కార్యక్రమాలు కూడా చకచక పూర్తి చేసి మరో పక్క ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేసారు.

మరో వైపు జూనియర్ జై లవకుశ కూడా అంతే స్పీడ్ తో పరుగులు తీస్తోంది. సెప్టెంబర్ 29 న పైసా వసూల్ తీసుకురావాలని నిర్మాతలు డిసైడ్ కాగా కాస్త అటు ఇటు అదే సీజన్ లో జై లవకుశ కూడా తీసుకొద్దామని నిర్మాత కళ్యాణ్ రామ్ ఆలోచిస్తే తారక్ అలా వద్దని, కావాలంటే మన సినిమా ముందుగానే రిలీజ్ చేసుకుందామని చెప్పినట్టు టాక్.

సో కనీసం ఈ రెండు సినిమాలు రెండు లేదా మూడు వారాల గ్యాప్ ఉండటం ఖాయం. ఇది బాలయ్య బాబాయ్ మీద ప్రేమ అని తారక్ ఫాన్స్ అంటుంటే అలా కాదు మా సినిమా ముందుగానే చెప్పేసాం కాబట్టి మీరు ముందే వస్తున్నారు అని బాలయ్య ఫాన్స్ సమర్దించుకుంటున్నారు. మొత్తానికి బాబాయ్‌ అబ్బాయ్‌ల మధ్య సినిమా వార్‌ మాత్రం తప్పిందినే చెప్పాలి.

- Advertisement -