‘జై లవ కుశ’లో ట్రిపుల్ రోల్‌తో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అవుతోన్న ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలి ఆటతోనే హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ చిత్రం… మన దేశంలోనే కాకుండా, ఓవర్సీస్ లో సైతం అదరగొడుతోంది.
తాజాగా ఈ సినిమా రూ. 100 కోట్ల మార్కును దాటినట్టు నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ ట్విట్టర్లో తెలిపాడు. ‘జై లవ కుశ’ సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. రూ. 100 కోట్ల కలెక్షన్లను ఈ సినిమా దాటేసిందని… ఇంకా వసూళ్లను రాబడుతూనే ఉందని చెప్పాడు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. విడుదలైన మూడు రోజులకే రూ.75 కోట్లు రాబట్టిన ఈ సినిమా వారం రోజుల్లోపే రూ.100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. మరోవైపు, వరుసగా రెండు ఎన్టీఆర్ సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం గమనార్హం. ‘జై లవ కుశ’ కు ముందు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టింది.
A big thanks to Telugu Film lovers across the world for this massive success pic.twitter.com/HhE2unWerW
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 27, 2017
‘జై లవకుశ’ ఓవర్సీస్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే నేడు విడుదలైన ‘స్పైడర్’ అంతకుమించిన రీతిలో వసూళ్లు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. స్పైడర్ జైలవకుశ వసూళ్లకు బ్రేక్ వేస్తుందా తెలియాలంటే కొద్దిరో్జులు ఎదురుచూడాల్సిందే.