తొలి సినిమాతోనే స్టార్ హీరోకి జోడీగా ఛాన్స్ దక్కడం .. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అదృష్టం కైరా అద్వానికి దక్కింది. మహేశ్ బాబు మూవీ ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ సుందరి భారీ హిట్ ను సొంతం చేసుకుంది. వసుమతిగా కైరా తన నటనతో ఫ్యాన్స్ ను కట్టిపడేంది. దీంతో టాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటు వస్తున్నాయి ఈ భామకి.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో సైతం నటించే అవకాశాన్ని కొట్టేసింది. చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా కైరా నటించనుంది. అయితే ఎవరి సరసన కైరా నటిస్తుందో చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కైరా ఎవరితొ రొమాన్స్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు చరణ్ .. బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగులో చిట్టిబాబు రీసెంట్‌గా జాయిన్ అయ్యాడు. అయితే, కైరా మాత్రం ఇంకా షూటింగ్‌లో పాల్గొనలేదు. చెర్రీతో షూటింగులో పాల్గొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా కైరా అద్వాని చెబుతోంది. ఏదిఏమైనా వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది వసుమతి.