నాన్నకు ప్రేమతో…. అభయ్‌ రామ్

205
Ntr Birthday celebrations
- Advertisement -

17 ఏళ్లకే హీరోగా వెండితెరపైకి దూసుకువచ్చి అనతికాలంలోనే స్టార్ హీరోగా మారాడు నందమూరి వారసుడు ఎన్‌టిఆర్. శనివారంనాడు ఎన్‌టిఆర్ 34వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యుల నడుమ చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.నిన్న రాత్రి తన భార్య, కుమారుడు అభయ్ రామ్‌లు బర్త్‌డే విషెస్ చెప్పారని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

తనకు తొలి, అతి విలువైన బర్త్‌డే విషెస్ ఇవేనంటూ కుమారుడు అభయ్ రామ్ తనకు విషెస్ చెప్పిన సందర్భంలో దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్‌టిఆర్, బాబీ దర్శకత్వంలో జై లవకుశ అనే మూవీలో నటిస్తున్నారు. శుక్రవారం ఎన్‌టిఆర్ బర్త్‌డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.

తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ #HappyBirthdayNTR ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ ట్వీట్లు కూడా విపరీతంగా షేర్ అవుతున్నాయి.

- Advertisement -