ఎన్టీఆర్ మళ్లీ తిరిగి వస్తావా?

44
- Advertisement -

స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల మొదలైన దగ్గర నుంచి ఆయన పేరు నిత్యం వార్తల్లో నలుగుతూనే ఉంది. ఆయన ముఖచిత్రంతో రూ. 100 నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ నాణెం కోసం తెలుగు తమ్ముళ్లు తన్నుకొని చస్తున్నారు. మరి పైనుంచి ఇదంతా ఆ ఎన్టీవోడు చూడకుండా ఉంటాడా ?. కచ్చితంగా చూస్తాడు. మరి చూస్తూ.. పైనేం చేస్తావ్ అన్నగారు ?, అయినా, మిమ్మల్ని ఆ ఇంద్రుడేం చేస్తాడు… స్వర్గం నుంచి తప్పించుకు వచ్చేయండి. మీరు పెట్టిన పార్టీ ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది.

మరోపక్క మీ వారసత్వం కోసం యుద్ధం జరుగుతుంది. నాది అన్న గారి గొంతు అంటూ నారా లోకేష్ శపధాలు చేస్తున్నాడు. కానీ అవన్నీ కామెడీగానే ఉన్నాయి. ఇక మీ నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి మరోలా ఉంది. నట సార్వభౌముడు అంటూ మీ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించినా.. అటు వైపు తొంగి చూడలేదు మీ నట మనవడు. ఒక రాష్ట్రపతి చేతుల మీదుగా తన తాతయ్య నాణెంను విడుదల చేస్తే.. వెళ్ళడానికి సాకులు చెప్పుకోవడం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కే చెల్లింది.

Also Read:కిస్‌మిస్‌ పండ్లతో ఆరోగ్యం..

ఏ మాటకు మాట చెప్పుకోవాలి.. మీ కుటుంబ సభ్యులు అంతా ఆ వేడుకలో పాల్గొన్నారు. అందరూ మీరూ మళ్లీ పుట్టాలని వేడుకున్నారు. మరి మీరు మళ్లీ ఈ నెల పైకి వస్తారా ?, వెన్నెల్లో ఆరుబయట పట్టెమంచమ్మీద మెత్తటి పరుపూ, గళ్ళదుప్పటీ, బూరుగుదూది తలగడాలూ పెట్టుకుని.. మీ పాటలు వింటూ నిద్రట్లోకి జారుకున్న రోజులను.. మళ్లీ తెలుగు ప్రజలకు తిరిగి ఇస్తారా ?, మగతనమంటే తెల్లటి లాల్చీపైజమాల్లో కులాసాగా వెలిగే సిగరెట్టేసుకునే రోజులు కావివి. తొడకొట్టడం, తొందరగా కొట్టడం… ఇవీ మగతనపు లక్షణాలు! అయినా వాటిని పరిచయం చేసింది ఎన్టీవోడే అని ఈ కాలపు కుర్రాళ్లకు తెలియకుండా కాదులే. కాబట్టి.. ఎన్టీవోడికి ఈ కాలపు అభిరుచులు కూడా అలంకారాలే.

ALso Read:అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు..

- Advertisement -