జూలైలో.. ఎన్టీఆర్‌ బయోపిక్‌

233
- Advertisement -

నందమూరి బాలకృష్ణ.. డైరెక్టర్‌ తేజ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త తెరపైకి వస్తుంది. ‘జై సింహా’ సినిమా తరువాత బాలకృష్ణ ఎన్టీఆర్‌ సినిమాతో సెట్స్ పైకి వెళతారని అంతా అనుకున్నారు. అందుకు సంబంధించిన పనులు కూడా చకచకా జరిగాయి. కానీ సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇప్పుడు మరింత ఆలస్యం కానుందనే టాక్ వినిపిస్తోంది.

NTR Biopic Starts in July!

ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు నిర్మాత సాయి కొర్రపాటి అండ్ టీం. అంతేకాదు ఈ మూవీలో పాత్రలను కొత్తవారితో చేయించే అలోచనలో ఉన్నారట. అయితే ఈ సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది కావడంతో వారికి శిక్షణ ఇచ్చిన తరువాతే షూటింగ్‌ మెదలుపెట్టనున్నారట. అంతేకాదు ఈ మూవీ ఆలస్యం కావడాని మరో కారణం కూడా ఉందని సమాచారం. అదేమిటనేగా మీ సందేహం..

డైరెక్టర్‌ తేజ హీరో వెంకటేష్‌తో కొత్త మూవీ మొదలుపెట్టడడం ఒక కారణమైతే.. నిర్మాత సాయి కొర్రపాటి చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌తో సినిమాను నిర్మిస్తుండడం మరో కారణం. అంతేకాదు బాలయ్య కూడా కొత్త సినిమా పట్టాలెక్కించే పనిలో ఉండడంతో ఈ ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా ఆలస్యం అవుతుందని సినివర్గాల సమాచారం. అన్నీ కుదిరితే.. ఈ మూవీ జూలైలో మొదలౌతుందని ఫిలిమ్‌నగర్‌ టాక్‌.

- Advertisement -