ఎన్టీఆర్ బయోపిక్ షురూ…

221
NTR biopic starts
- Advertisement -

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దిగ్గజ నటుడు ఎన్టీఆర్ బయోపిక్‌కు క్లాప్ పడింది. రామకృష్ణ స్టూడియోస్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. పలువురు సినీ,రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తుండటం విశేషం.

సినిమాలో ఏఏ అంశాలను చూపించబోతున్నారన్న విషయాన్ని తెలిపేలా రూపొందించిన పోస్టర్‌ అందరిని ఆకట్టుకుంది. ఎన్టీఆర్ సొంత ఊరిలోని ఇళ్లు, వెండితెరపై ఎన్టీఆర్ పోషించిన అ‍ద్భుత పాత్రలను కలిపి పోస్టర్‌ని డిజైన్‌ చేశారు. దీంతో పాటు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం,టీడీపీ స్థాపన,ఆయన ఉపయోగించిన ప్రచార రథంతో పాటు పార్టీ జెండా కూడా ఉండేలా డిజైన్ చేసిన పోస్టర్ అందిరిని ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాకు సంగీతం కీరవాణి అందిస్తుండగా గౌతమిపుత్ర శాతకర్ణికి మాటలు అందించిన సాయి బుర్రమాదవ్ మాటలు రాశారు. నేనే రాజు నేనే మంత్రితో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తేజ దర్శకత్వం వహించనున్నారు.

- Advertisement -