ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ ను తెరెకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఆయన పాత్రలో నటించగా..ప్రమఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని మొత్తం కథానాయకుడిగా..ఆయన రాజకీయ జీవితాన్ని మాహానాయకుడుగా విడుదల చేయనున్నారు. మొదటి పార్ట్ ఇప్పటికే పూర్తి కావడంతో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు.
ఈమూవీ ఆడియో వేడుకను ఎన్టీఆర్ జన్మస్ధలమైన నిమ్మకూరులో నిర్వహించాలనుకున్నారు. అయితే పెథాయ్ తుఫాన్ ప్రభావం వల్ల ఈ కార్యక్రమాన్ని హైదరబాద్ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 21న నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యుల మధ్య ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈఆడియో వేదికకకు ముఖ్య అతిధిగా ఎపీ సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 9, 2019లో విడుదల చేయనున్నారు.విద్యాబాలన్, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్ రామ్, సుమంత్ , రకుల్ , నిత్యామీనన్ పలువురు ఈమూవీలో నటిస్తున్నారు.