ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ‘తోట రాముడు’గా బాలయ్య..

202
NTR biopic
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రఖ్యాత నటుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు క్రిష్ ఎన్టీఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు పార్ట్‌లుగా రానున్న ఈ చిత్రం జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్‌ కెరియర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు ఉన్నాయి. అయితే అందులో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘పాతాళ భైరవి’ మొదటి వరుసలో కనిపిస్తుంది. తెలుగు జానపద చిత్రాల జాబితాలోను ఈ సినిమా ముందు వరుసలోనే కనిపిస్తుంది. ఒక ట్రెండ్ సెట్టర్ లా నిలిచిన ఈ సినిమాలో ఎన్టీ రామారావు ‘తోట రాముడు’ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు.

NTR biopic

అయితే ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ కూడా ‘తోట రాముడు’గా తెరపై సందడి చేయనున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ‘పాతాళ భైరవి’ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు కూడా వున్నాయి. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ‘తోట రాముడు’గా బాలకృష్ణ అదరగొట్టేస్తున్నాడని సమాచారం. ఈ పాత్రకి సంబంధించిన పోస్టర్‌ను కూడా క్రిష్ త్వరలో వదిలే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -