జక్కన్న మల్టీస్టారర్‌ మూవీ కథ ఇదేనట..

252
NTR And Ram Charan To Play Boxers In Rajamouli Film
- Advertisement -

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ ‘సెట్’ అయినట్లే కనిపిస్తుంది. దీనిని దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. మల్టీస్టారర్‌ చిత్రంగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారని ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించనున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని ‘జక్కన్న’ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకధీరుడు తెరకెక్కించబోయే మల్టీస్టారర్‌ చిత్రం గురించి రోజుకో కొత్త విషయం బయటికొస్తోంది.

 NTR And RamCharan To Play Boxers In Rajamouli Film

ఈమూవీలో చరణ్‌, తారక్‌ బాక్సర్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఓ కుటుంబ కథను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. అదే నిజమైతే అది ఎవరి కుటుంబం గురించి అన్నది తెలియాల్సి ఉంది. అదీకాకుండా కుటుంబ కథా నేపథ్యం ఉన్న చిత్రాలకు జక్కన్న అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అలాంటి నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మర్యాద రామన్న’. ఆ తర్వాత ఫాంటసీలు, గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉండే చిత్రాలను తెరకెక్కించారు. దాంతో ఇప్పుడు తీయబోయే చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు.. తొలి సన్నివేశం తారక్‌పైనే చిత్రీకరించనున్నారట. అన్నీ అనుకున్నట్లు కుదిరితే సినిమా 2018 అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

- Advertisement -