దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఫ్రోగ్రాం బిగ్ బాస్. మొదట హిందీలో మొదలైన బిగ్ బాస్ మంచి ఆదరణ లభించడంతో తెలుగు, తమిళం వంటి పలు భాషలలో ప్రారంభించారు. తెలుగు బిగ్ బాస్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించి, బుల్లితెరపై సరికొత్త రికార్డు సృష్టించాడు. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన షోగా నిలిచింది బిగ్ బాస్-1. బిగ్ బాస్ సీజన్ 2కి వ్యాఖ్యాతగా చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపలేదు. సినిమాలతో బిజీగా ఉండడంతో వ్యాఖ్యాతగా చేయలేనని చెప్పేశాడు.
ఎన్టీఆర్ తిరస్కరించడంతో ఆయన స్థానంలో నానిని ఎంపికచేసుకుంది బిగ్ బాస్ యాజమాన్యం. కానీ సీజన్-1కి వచ్చినంత క్రేజ్ .. నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సీజన్2కి రావడం లేదని విమర్శలొస్తున్నాయి. నాని తన మాటలతో మాయ చేస్తున్పటికీ.. కొందరు ఎన్టీఆర్ తో పోలుస్తూ విమర్శలు చేస్తున్నారు. సీజన్2లో 16 మంది సెలబ్రెటీలలో ఒకరిద్దరి మినహా.. మిగతా వారు ఆకట్టులేకపోవడం మరోకారణంగా చెబుతున్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్.. బిగ్ బాస్ సీజన్2 గురించి స్పందించారు. ప్రతీవారం నాని చెబుతున్న కాకమ్మ కథలు బాగున్నాయి. చూస్తూనే ఉన్నా.. నాని చాలా మంచి నటుడు, బాగా చేస్తున్నాడు. బిగ్ బాస్ అద్భుతమైన ప్లాట్ ఫామ్… ఎవరు వ్యాఖ్యాతగా చేసినా బాగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.