సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ, లక్ష్మి పార్వతి. ఎన్టీఆర్ అంటే కేవలం మూడక్షరాల పేరు కాదు, ఎన్టీఆర్ అంటే ప్రభంజనం అని కొనియాడారు లోకేశ్. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక గొప్ప సంస్కరణలు తెచ్చారు అని గుర్తుచేశారు.
ఎన్టీఆర్ ఒక ప్రభంజనం అన్నారు నందమూరి బాలకృష్ణ. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు అని…సినిమా రంగంలోనైనా, రాజకీయాల్లో నైనా ఆయనను అభిమానులు, కార్యకర్తలు దేవుడిలా కొలిచే వారు అన్నారు.
నా భర్త ఎలా చనిపోయారో, ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసు అన్నారు లక్ష్మి పార్వతి. గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నాను…ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అన్నారు. నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు… అందరి సమక్షంలోనే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారు అన్నారు.
Also Read:చాగంటికి అవమానం..ఖండించిన టీటీడీ